పెద్ది సప్నని కలిసిన సర్పంచ్ బుర్ర సుదర్శన్ గౌడ్
చెన్నారావుపేట అక్టోబర్ 08 ప్రజావాణి

వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న రెడ్డిని హనుమకొండలోని ఆమె నివాసంలో చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామ సర్పంచ్ బుర్ర సుదర్శన్ గౌడ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం పాపయ్యపేట గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై పెద్ది స్వప్న రెడ్డి తో సర్పంచ్ సుదర్శన్ గౌడ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి గుర్రం రవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మొర్రి కట్టయ్య, వార్డు మెంబర్ మరాఠీ కట్టయ్య, బర్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.