prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 9:37 pm Digital Edition : PRAJA VANI

పెద్దమల్లారెడ్డిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

పెద్దమల్లారెడ్డిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

భిక్కనూర్, అక్టోబర్ 01 ( ప్రజావాణి ):

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఖరీఫ్‌ 2026–27 వానాకాలం వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం పెద్దమల్లారెడ్డిలో ప్రారంభించారు. సొసైటీ చైర్మన్, బాలగౌని రాజాగౌడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు మద్దతు ధర అందడంతో పాటు ధాన్యం విక్రయానికి సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు ఇటిక్యాల బాగారెడ్డి, సూరం కిష్టయ్య, మంద రాజమణి, స్థానిక సర్పంచ్ కోడూరి సాయాగౌడ్, ఉపసర్పంచ్ చైతన్య, సంఘం సీఈఓ మోహన్‌గౌడ్, బాలుసిబ్బంది, రైతులు తదితరులుపాల్గొన్నారు.