పెద్దమల్లారెడ్డిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
భిక్కనూర్, అక్టోబర్ 02 ( ప్రజావాణి ):
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల్లో సామాజిక బాధ్యత, ఐక్యత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరి సాయి గౌడ్, ఉపసర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాలగోని రాజా గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఇటిక్యాల సురేందర్ రెడ్డి, ఎల్లం రెడ్డి, తిప్పని ఇస్తారి, ఈశ్వర్ రెడ్డి,బుడ్డ శ్రీనివాస్, వార్డు సభ్యులు వడ్ల శ్రీనివాస్, కంతి నరసింహులు, మాధవరెడ్డి, ఎల్లం రాజు, బాలు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సత్తూరి రాజలింగం, సొసైటీ డైరెక్టర్ సల్మెడ బాబు,పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.