పూల పండుగకు పోత్కపల్లి పులకింత
పూల పండుగకు పోత్కపల్లి పులకింత.. వెలుగుల జిలుగుల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు! డీజే హోరు.. కోలాటాల హుషారు.. సంప్రదాయ పాటల సందడి.. విద్యుత్ దీపాల వెలుగుల్లో కనువిందు చేసిన బతుకమ్మలు ఓదెల ప్రజా వాణి:పోత్కపల్లి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ పోత్కపల్లి గ్రామంలో పూల పరిమళాలు వెదజల్లుతూ, ఆటపాటల సందడితో అంగరంగ వైభవంగా సాగింది. సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రాంగణం పూల వనంగా మారింది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, విద్యుత్ దీపాల అలంకరణలు,...