prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 8:38 am Digital Edition : PRAJA VANI

పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి

పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి

ఆర్‌డీఎఫ్ పాఠశాలకు 34 మ్యాట్లు, 50 కిలోల బియ్యం వితరణ

తంగళ్లపెల్లి ప్రజావాణి

పుట్టినరోజు వేడుకలను కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడమే కాకుండా, ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలనే సేవా స్ఫూర్తిని చాటారు ఓ చిన్నారి తల్లిదండ్రులు.
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన చింతమడక అనిల్‌కుమార్, అరుణ దంపతుల కుమార్తె చింతమడక శెజిలియా పుట్టినరోజు సందర్భంగా ఆర్‌డీఎఫ్ మాతెండ్లా పాఠశాలకు 34 వ్యక్తిగత మ్యాట్లు, మధ్యాహ్న భోజన కార్యక్రమానికి 50 కిలోల బియ్యాన్ని దాతృత్వంగా అందజేశారు.పాఠశాల విద్యార్థుల అవసరాలను గుర్తించి ఉపయోగకరమైన వస్తువులను అందించడం పట్ల పాఠశాల యాజమాన్యం శెజిలియా తల్లిదండ్రులను అభినందించింది. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా మార్చి, విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొంది.చిన్నారి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే సేవా భావానికి ప్రాధాన్యతనిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.