పుట్టినరోజున కేక్ కట్ కాదు… రక్తదానం
పుట్టినరోజున కేక్ కట్ కాదు... రక్తదానం! - యువతకు ఆదర్శంగా మల్కాపూర్ యువకుడు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 09 (ప్రజావాణి): సాధారణంగా పుట్టినరోజు అంటే ఫ్రెండ్స్ తో హంగామా, కేక్ కటింగ్, పార్టీలు. కానీ మల్కాపూర్ యువకుడు రంజిత్ రెడ్డి మాత్రం తన పుట్టినరోజును సేవా కార్యక్రమంతో గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. జిల్లా లోని చిల్పూర్ మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేశారు. ఇది ఆయనకు 29వ...