పుట్టపహాడ్ రామశిల దగ్గర దుర్గ మాత సన్నిధిలో అన్నదానకార్యక్రమం
పుట్టపహాడ్ రామశిల దగ్గర దుర్గ మాత సన్నిధిలో అన్నదానకార్యక్రమం పరిగి:అక్టోబర్16 ( ప్రజావాణి): గ్రామ పరిధిలోని ప్రసిద్ధ రామశిల క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. గ్రామానికి చెందిన ప్రముఖులు మ్యాడం మాణిక్యం కుటుంబ సభ్యులు భక్తుల సౌకర్యార్థం ఈ అన్నప్రసాద వితరణను ఏర్పాటు చేశారు. ముందుగా అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు, దివ్యాలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పందిట్లో భక్తులకు భోజనాలు వడ్డించారు. స్థానిక గ్రామస్థులతో పాటు...