prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:32 pm Digital Edition : PRAJA VANI

పుట్టపహాడ్ రామశిల దగ్గర దుర్గ మాత సన్నిధిలో అన్నదానకార్యక్రమం

పుట్టపహాడ్ రామశిల దగ్గర దుర్గ మాత సన్నిధిలో అన్నదానకార్యక్రమం

పరిగి:అక్టోబర్16 ( ప్రజావాణి):

గ్రామ పరిధిలోని ప్రసిద్ధ రామశిల క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. గ్రామానికి చెందిన ప్రముఖులు మ్యాడం మాణిక్యం కుటుంబ సభ్యులు భక్తుల సౌకర్యార్థం ఈ అన్నప్రసాద వితరణను ఏర్పాటు చేశారు.
ముందుగా అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు, దివ్యాలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పందిట్లో భక్తులకు భోజనాలు వడ్డించారు. స్థానిక గ్రామస్థులతో పాటు సమీప గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించారు. భక్తి ప్రపత్తులతో అన్నదాన సేవ చేపట్టిన మాణిక్యం కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో గ్రామ యువకులు, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.