పుంగనూరులో రక్తాసిక్తం: ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్పై ఘోర దాడి – నామినేషన్ల వేళ యుద్ధభూమిగా మారిన నియోజకవర్గం
పుంగనూరు అక్టోబర్ 16 ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్రస్థాయిలో రాజకీయ హింసాకాండ చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాన్వాయ్పై ఘోరమైన దాడి జరిగింది. ఈ ఘటనపై అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.కత్తులు, రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డ మూకలు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు మద్దతుగా, వారి చేత నామినేషన్లు...