పీరంపల్లిలో కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మిక తనిఖీలు
పీరంపల్లిలో కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మిక తనిఖీలు: పనుల నాణ్యత, సంక్షేమ పథకాల అమలుపై ఆరా.. పరిగి/కుల్కచర్ల,అక్టోబర్ 30(ప్రజావాణి ) మండల పరిధిలోని పీరంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సుడిగాలి పర్యటన చేపట్టారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న పంట పొలాల స్థితిగతులను, భూ సర్వే ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి పంటల పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలను అడిగి...