పిచ్చి మొక్కలతో తోర్నాల పల్లె పకృతి వనం
పట్టించుకొని అధికారులు… ప్రజా ప్రతినిధులు
ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు
మద్దూరు అక్టోబర్27,ప్రజా వాణి,
మండలంలోని తోర్నాల గ్రామానికి చెందిన పల్లె పకృతి వనం పిచ్చి మొక్కలతో దర్శనం ఇస్తున్నా పట్టించుకునే అధికారులు….. ప్రజా ప్రతినిధులు కనుమరుగయ్యారనీ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో మినీ పార్కు కోసం ఏర్పాటు చేసిన పల్లె పకృతి వనం ఇలా పిచ్చి మొక్కలతో దర్శనం ఇస్తుండటంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తూ ప్రజల్లో ప్రభుత్వం తీరుపై ప్రజలు మండి పడేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయి అధికారుల తీరు ఇలా ఉంటే మండల స్థాయి అధికారులు పల్లె పకృతి వనాలను సందర్శించిన దాఖలాలు లేవని గ్రామస్థులు మండిపడుతున్నారు. తక్షణమే పల్లె పకృతి వనంలోని పిచ్చి మొక్కలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.