prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 11:10 am Digital Edition : PRAJA VANI

పాలకుర్తి ఆడపడుచులకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

*పాలకుర్తి ఆడపడుచులకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి):  పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఆడపడుచులకు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా పాలకుర్తి శాసన సభ్యురాలు  యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్  ఝాన్సీ రాజేందర్ రెడ్డి  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని, తెలంగాణ జీవన విధానానికి, మహిళల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు.

ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని, సౌభాగ్యాన్ని, సుఖసంతోషాలను నింపాలని, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఆడపడుచు జీవితంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఆనందాన్ని, శాంతిని, సౌభాగ్యాన్ని తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.