పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతుకను అణచివేస్తున్న బీజేపీ

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతుకను అణచివేస్తున్న బీజేపీ ప్రజాస్వామ్య హక్కుల కోసం మా పోరాటం ఆగదు.. నియంతృత్వాన్ని సహించేది లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి అక్టోబర్ 31 న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతుకను అణచివేస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజా సమస్యలను లేవనెత్తిన ప్రతిసారీ మైక్ కట్ చేయడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు మైక్ కట్ చేయడం, ప్రజా...