prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 9:35 pm Digital Edition : PRAJA VANI

పారిశుధ్య కార్మికులతోఉదయం 5 గంటల సమయంలో సమావేశమైన మున్సిపల్ చైర్మన్

పారిశుధ్య కార్మికులతోఉదయం 5 గంటల సమయంలో సమావేశమైన మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట అక్టోబర్ 27 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలో తెల్లవారుజామున పారిశుద్ధ్య నిర్వహణపై ఉదయం 5 గంటలకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పారిశుద్ధ్య కార్మికులు,శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మరియు జవాన్లతో కలిసి సమీక్ష నిర్వహించి పట్టణంలోని పారిశుద్ధ్య నిర్వహణపై చర్చించారు పట్టణంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలనిప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు పారిశుద్ధ్య కార్మికులు సమయపాలన పాటిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు ప్రజలందరితో మమేకమై పనులు చేస్తూ పట్టణం మొత్తం మన కుటుంబం అని తెలిపారు