prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 1:54 pm Digital Edition : PRAJA VANI

పారిశుద్ధ్య సిబ్బందికి దసరా కానుకగా బట్టలు పంపిణీ చేసిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

పారిశుద్ధ్య సిబ్బందికి దసరా కానుకగా బట్టలు పంపిణీ చేసిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకొని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి దసరా కానుకగా బట్టల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పాల్గొని సిబ్బందికి స్వయంగా బట్టలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ… గ్రామ పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని, వారి కృషి వల్లనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని కొనియాడారు. పండుగ వేళ వారి కుటుంబాల్లో సంతోషం నింపాలనే ఉద్దేశంతో ఈ చిన్న కానుకను అందజేస్తున్నామని, గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ సిబ్బంది సంక్షేమానికి అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు మెంబర్లు వేల్పుల శోభారాణి, గొరిగే సందీప్, కత్తి శ్రీవాణి, బొజ్జం సునీత ప్రభాకర్, నల్ల విల్సన్, వంగ సతీష్, బండారి మమత అశోక్, బత్తిని వేణు, గొరిగే సాయిలు, కొమ్మరాజుల రేణుక కొమ్మురయ్య, తాండ్ర భారత్, నాయకులు కొత్తకొండ గంగాధర్, గ్రామ పంచాయతీ కారోబర్ చెరుకు అజయ్, మొగుళ్లగొని మహేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.