పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ……
నాగర్ కర్నూల్ జిల్లా..
కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అక్టోబర్ 08(ప్రజావాణి)
వెల్దండ: మండల కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు గురువారం శ్రీసత్యసాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో అందజేసిన చీరాలను గ్రామ సర్పంచ్ మట్టయాదమ్మవెంకటయ గౌడ్ పంపిణీ చేశారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛత ద్వానా దివ్వత్వమునకు జాతీయ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కార్యదర్శి గిరిగౌడ్, నిర్వాహకులు లక్ష్మన్, గిరిజ, సువర్ణ, మాధవి, లత, అనిత తదితరులు పాల్గొన్నారు.