పాతగూడూరు నవరాత్రి ఉత్సవాలకు మద్దుల గోపాల్‌రెడ్డికి ఆహ్వానం
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరులో శ్రీ నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే ‘దుర్గాదేవి ఆగమనం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్‌రెడ్డిని నిర్వాహకులు శుక్రవారం కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించిన గోపాల్‌రెడ్డి, కార్యక్రమంలో తప్పక పాల్గొంటానని తెలిపారు. గ్రామంలో ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిపారవశ్యంతో జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు కిషన్, శ్రీధర్, రాజురెడ్డి, రేవంత్, అరవింద్...