పాతగూడూరులో దుర్గాదేవి ఆగమనం: కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్‌రెడ్డికి ఆహ్వానం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి అక్టోబర్ 09 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామంలో శ్రీ నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ‘దుర్గా ఆగమనం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డిని ఉత్సవ కమిటీ నిర్వాహకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా గ్రామంలో దేవీ నవరాత్రి...