*పాడైపోయిన బియ్యం మేతగా.. మూడు బర్రెలు మృత్యువాత*
.రైస్ మిల్లు నిర్లక్ష్యం.. బర్రెల ప్రాణాలు బలి.
.మొద్దులగూడెంలో విషాదం.. పాయిజన్ బియ్యం తిని 3 బర్రెలు మృతి.
*గోవిందరావుపేట (ప్రజావాణి)*
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం,పస్రా
మొద్దులగూడం గ్రామ శివారులో ఒక రైస్ మిల్లు యజమాని పాడైపోయిన, పాయిజన్ అయిన బియ్యాన్ని నిర్లక్ష్యంగా పారబోయడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పారబోసిన బియ్యాన్ని తిన్న ఐదు బర్రెల్లో మూడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో రెండు బర్రెలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. బర్రెల యజమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పాడైపోయిన బియ్యాన్ని ఇష్టారాజ్యంగా బయట పారబోయడం వల్లే ఈ దారుణం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.