prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 8:13 pm Digital Edition : PRAJA VANI

పాడెమోసిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

పాడెమోసిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం, కొమురవెల్లి మండలంలోని అయినాపూర్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ పబ్బోజు విజేందర్ కుమారుడు పబ్బోజు మురళి కార్తీక్ (28) నిన్న అర్ధరాత్రి కుషాయిగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. యువకుడి మృతితో అయినాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విషయం తెలుసుకున్న జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం హుటాహుటిన అయినాపూర్ లోని వారి నివాసానికి చేరుకొని మురళి కార్తీక్ మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ విజేందర్ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. “ఇది చాలా బాధాకరమైన సంఘటన, కుటుంబానికి అండగా ఉంటా, ధైర్యంగా ఉండండి” అని భరోసా ఇచ్చారు.

అనంతరం జరిగిన అంతిమయాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా పాల్గొని పాడెమోశారు. ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని మురళి కార్తీక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.