పాఠశాల గడప దాటి పార్లమెంట్ ప్రాంగణంలోకి విద్యార్థులు

పాఠశాల గడప దాటి పార్లమెంట్ ప్రాంగణంలోకి విద్యార్థులు.. ప్రజాస్వామ్య పాలనపై ప్రత్యక్ష అవగాహన! పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పోత్కపల్లిలో ఆదర్శ పార్లమెంట్ నిర్వహణ.. సభా వ్యవహారాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన **ఓదెల/పోత్కపల్లి, అక్టోబర్ 31, ప్రజావాణి ప్రతినిధి:** విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కలిగి ఉండటంతో పాటు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలనే లక్ష్యంతో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోత్కపల్లిలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన...