పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ప్రజావాణి నెల్లికుదురు.మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు స్థానిక హెచ్ఎం వాణిశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు.విద్యార్థినులు తీరొక్క పూలను తీసుకొచ్చి అందంగా బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
నరసింహుల గూడెం యుపిఎస్ లో హెచ్ఎం పద్మావతి,జెడ్ పి హెచ్ ఎస్ లో హెచ్ఎం జలగం శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం విజయలక్ష్మి, మేచరాజుపల్లి హైస్కూల్లో హెచ్ఎం మంగతాయి,వావిలాల యుపిఎస్ లో హెచ్ఎం అడప కరుణాకర్ ఆధ్వర్యాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఆయా పాఠశాలల హెచ్ఎంలు బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం గురించి వివరించారు. బాలిక బాల బాలికల తో కలిసి ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు ఆడి పాడారు.