*పాఠశాలకు రూ.22 వేల విలువైన బీరువాలు అందజేత*
*మాజీ ఎంపీపీ దొడ్డ సురేష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా వితరణ*
చిలుకూరు, అక్టోబర్ 9 (ప్రజావాణి): చిలుకూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మాజీ ఎంపీపీ దొడ్డ సురేష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె గోడపాటి అనన్య, ఆమె భర్త నవీన్ రూ.22 వేల విలువైన బీరువాలను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారావుకు వాటిని అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు, గ్రామ ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. పాఠశాల అవసరాలకు ఉపయోగపడేలా బీరువాలను అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజారాం ,కైలాస ఏడుకొండలు, షేక్ జానిమియా,రేణుక, సాంసన్, సజ్జన కుమారి, అంకిరెడ్డి, కృష్ణ,ఝాన్సీ,దొడ్డ సురేష్ బాబు సతీమణి ఝాన్సీ, దొడ్డ రమేష్, దొడ్డ శ్రీధర్, కొడారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.