prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 6:53 pm Digital Edition : PRAJA VANI

పవర్‌ ఫ్యాక్టర్‌పై ప్రత్యేక దృష్టి

పవర్‌ ఫ్యాక్టర్‌పై ప్రత్యేక దృష్టి
అయ్యగారిపల్లి 132 కేవీ సబ్‌స్టేషన్‌లో డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ సమీక్ష
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్‌ 8 ప్రజావాణి: అయ్యగారిపల్లి 132 కేవీ సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ లోడ్‌ పరిస్థితిని టీజీ ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) టి. మధుసూదన్‌ గురువారం సమీక్షించారు. సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరా, లోడ్‌ పరిస్థితులను పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా విద్యుత్‌ వ్యవస్థలో పవర్‌ ఫ్యాక్టర్‌ (PF)ను నిర్దేశిత స్థాయిలో కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పవర్‌ ఫ్యాక్టర్‌ మెరుగ్గా ఉండేలా అవసరమైన మేరకు కెపాసిటర్‌ బ్యాంకులను నిరంతరం ఆన్‌లో ఉంచాలని స్పష్టం చేశారు.
సబ్‌స్టేషన్‌లో లోడ్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, విద్యుత్‌ వ్యవస్థ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. లోడ్‌, పవర్‌ ఫ్యాక్టర్‌ తదితర అంశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్షలో మహబూబాబాద్‌ ఎస్‌ఈ దర్శన్‌ కుమార్‌, డీఈ కోటేశ్వరరావు రమేష్‌, ఏఈడీఈ, ఏఈ సంగీత, లైన్మెన్‌ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు