*పలుగు మీద పోచమ్మ సన్నిధిలో ఫైజాబాద్ యూత్ – ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో ఆత్మీయ భేటీ*
నవరాత్రి ఉత్సవాల సందడిలో షేర్ ఖాన్ పల్లి ఆలయం – ఫైజాబాద్ ముత్యాల పోచమ్మ యూత్ అసోసియేషన్ మహిళల భక్తి యాత్ర
చిలిపిచెడ్ అక్టోబర్ 11 (మన ప్రజావాణి నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి)
శరన్నవరాత్రి ఉత్సవాల పురస్కరించుకుని మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన శ్రీ ముత్యాల పోచమ్మ యూత్ అసోసియేషన్ మహిళా సభ్యులు భక్తి యాత్ర చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామ శివారులో వెలసిన ప్రసిద్ధ శక్తి క్షేత్రం, అత్యంత మహిమాన్వితమైన పలుగు మీద పోచమ్మ దేవస్థానాన్ని వారు దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుండగా, ఫైజాబాద్ గ్రామ మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు.
*ఎమ్మెల్యేతో ఆత్మీయ భేటీ:*
అదే సమయంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి కూడా పలుగు మీద పోచమ్మ అమ్మవారి దర్శనానికి రావడం విశేషం. ఫైజాబాద్ గ్రామానికి చెందిన ముత్యాల పోచమ్మ యూత్ అసోసియేషన్ మహిళా సభ్యులు ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించారు.
యూత్ సభ్యులు ఎమ్మెల్యే గారికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారితో కలిసి ఫైజాబాద్ శ్రీ ముత్యాల పోచమ్మ యూత్ అసోసియేషన్ మహిళా సభ్యులందరూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గ్రూప్ ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా సందడిగా, సంతోషంగా, భక్తి శ్రద్ధలతో నిండిపోయింది.
ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ అధ్యక్షులు, మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.