పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఒక విశిష్టమైన కార్యక్రమం
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నాగార్జున డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ మరియు 'యూత్ ఫర్ సేవా' స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టారు. కళాశాలలోని ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ లో ఉపయోగంలో లేని పాత రికార్డులు, నోట్‌బుక్స్ ను సేకరించి, వాటిని 'యూత్ ఫర్ సేవా' సహకారంతో రీసైక్లింగ్ చేయించారు. అలా రీసైకిల్ చేసి తయారు చేసిన నూతన నోట్‌బుక్స్ లో తొలి పుస్తకాన్ని ప్రిన్సిపాల్ ఉపేందర్ అధికారికంగా లాంచ్ (ఆవిష్కరణ) చేశారు....