నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నాగార్జున డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ మరియు ‘యూత్ ఫర్ సేవా’ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టారు. కళాశాలలోని ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ లో ఉపయోగంలో లేని పాత రికార్డులు, నోట్‌బుక్స్ ను సేకరించి, వాటిని ‘యూత్ ఫర్ సేవా’ సహకారంతో రీసైక్లింగ్ చేయించారు. అలా రీసైకిల్ చేసి తయారు చేసిన నూతన నోట్‌బుక్స్ లో తొలి పుస్తకాన్ని ప్రిన్సిపాల్ ఉపేందర్ అధికారికంగా లాంచ్ (ఆవిష్కరణ) చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉపేందర్ మాట్లాడుతూ… “చెట్లను నరకాల్సిన అవసరం లేకుండా, వాడేసిన నోట్‌బుక్స్ నుంచే తిరిగి కొత్త నోట్‌బుక్స్ తయారు చేయాలనే యూత్ ఫర్ సేవా ఆలోచన ఎంతో అభినందనీయం. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరగబోయే రీసైక్లింగ్ కార్యక్రమాలకు కూడా కళాశాల తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ శ్రీనివాస్ రెడ్డి, యూత్ ఫర్ సేవా నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్ నాగేందర్, ఇతర విభాగాల అధ్యాపకులు, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.