prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 2:06 pm Digital Edition : PRAJA VANI

పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం

పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం

రేబర్తి గ్రామ సర్పంచ్ నిరాటి శ్రీనివాస్

మద్దూరు అక్టోబర్1, ప్రజా వాణి,

రేబర్తిలో ఘనంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

మండలంలోని రేబర్తి గ్రామంలో ఘనంగా “స్వచ్ఛతా హి సేవ” కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా
రేబర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో “స్వచ్ఛతా హి సేవ – 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
“ఒక రోజు – ఒక గంట – ఒకే సమయంలో” కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, యువత, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో చీపుర్లు పట్టుకుని పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు.పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ నీరటి శ్రీనివాస్ సూచించారు.
“మన గ్రామం – మన బాధ్యత… పరిశుభ్రమైన రేబర్తి మన లక్ష్యం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.