పరకాల మండలంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పరకాల మండలంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ పరకాల, ప్రజావాణి పత్రిక: తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పరకాల మండలంలో మహిళలు ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ...