పరకాల మండలంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ
పరకాల, ప్రజావాణి పత్రిక:
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పరకాల మండలంలో మహిళలు ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

మహిళల ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలు పరకాల మండలంలో పండుగ వాతావరణాన్ని నింపాయి.