పత్తి రైతులకు వరంగా వసంత్ ముద్ర BG-II – కుర్చపల్లిలో పంట చూసి రైతుల్లో ఆనందం
ఎలినోవా వాతావరణాన్ని తట్టుకుని చెట్టుకు 70-80 కాయలతో అదరగొడుతున్న ముద్ర
జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్, అక్టోబర్ 11 (ప్రజావాణి): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో వసంత్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ముద్ర BG-II పత్తి క్షేత్ర పర్యటన మరియు రైతు అవగాహన సదస్సు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
నాణ్యమైన విత్తనాలే రైతులకు శ్రీరామరక్ష – సేల్స్ మేనేజర్ జి. చిరంజీవి:
ఈ సందర్భంగా వసంత్ సీడ్స్ సేల్స్ మేనేజర్ జి. చిరంజీవి మాట్లాడుతూ… రైతులు వసంత్ సీడ్స్ ముద్ర BG-II పత్తి నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఎలినోవా వాతావరణ పరిస్థితుల్లో, అకాల వర్షాలు, తెగుళ్ల బెడద ఉన్నప్పటికీ వసంత్ ముద్ర BG-II రకం పత్తి రైతులకు లాభసాటిగా మారిందని, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుని అద్భుతమైన దిగుబడిని ఇస్తుందని పేర్కొన్నారు.
క్షేత్రంలో రైతుల సందడి – 6 గ్రామాల నుండి 120 మంది హాజరు
రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లి, రఘునాథపల్లి, శివాజీ నగరం, కంచనపల్లి, మల్లంపల్లి తదితర 6 గ్రామాల నుండి దాదాపు 120 మంది రైతులు విచ్చేసి పంటను పరిశీలించారు. సాధారణ రకాలతో పోలిస్తే ముద్ర BG-II లో చెట్టుకు దాదాపు 70 నుండి 80 కాయలు కాయడం, పత్తి నాణ్యత బాగుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతున్నామన్నారు.
రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం – డీలర్ శేఖర్
స్థానిక డీలర్ పవన్ ఫర్టిలైజర్ ప్రొప్రైటర్ శేఖర్ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతులకు అందించడంతో పాటు రైతన్నకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి రాజు, డీలర్లు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.