prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 4:41 pm Digital Edition : PRAJA VANI

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి కూకట్‌పల్లి బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేసిన బీజేపీ డివిజన్ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాదరావు

కూకట్‌పల్లి (ప్రజావాణి) అక్టోబర్ 30:
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కూకట్‌పల్లి డివిజన్‌లో బీజేపీ నాయకత్వం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించి, ఓటరు నమోదు కార్యక్రమంపై సమగ్ర దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో కూకట్‌పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాదరావు బూత్ అధ్యక్షులకు కీలక సూచనలు చేశారు. ప్రతి బూత్ పరిధిలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారందరికీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ, నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో బూత్ అధ్యక్షుల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తమ పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కూకట్‌పల్లి డివిజన్‌లోని ప్రతి బూత్‌లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.