పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి: తహసీల్దార్ పురుషోత్తం పరిగి , అక్టోబర్ 14( ప్రజావాణి) పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కుల్కచర్ల తహసీల్దార్ పురుషోత్తం కోరారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా...