prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 5:32 pm Digital Edition : PRAJA VANI

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

*పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం…*

*ప్రసంగిస్తున్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఆయిలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 23*

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శుక్రవారం రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు , కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని , పట్ట భద్రులను కలిసి అభ్యర్థికి మద్దతు కోరాలని పిలుపు నిచ్చారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పని చేస్తూ ప్రచార కార్య క్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.