prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 11:33 am Digital Edition : PRAJA VANI

పట్టభద్రులూ.!ఓటు నమోదు చేసుకోవాలి

పట్టభద్రులూ.!ఓటు నమోదు చేసుకోవాలి..
బిజెపి మండల అధ్యక్షులు చందు రాజకుమార్
ప్రజావాణి, నెల్లికుదురు:వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు చేసుకోవాలని బిజెపి మండల అధ్యక్షులు చందు రాజకుమార్ యాదవ్ పట్టబద్రులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ నవంబర్ 6 తో ఓటు నమోదు గడువు ముగియనున్న దృష్ట్యా డిగ్రీ 2003 వరకు ఉత్తీర్ణులైన యువతి యువకులందరూ ఓటర్లుగా నమోదు కావాలన్నారు.పట్టభద్ర ఓట్లు ఎంతో విలువైన వన్నారు. దేశం కోసం ఆలోచన చేసేవారు పట్టభద్ర యువకులేనని మీ పవిత్ర ఓటును సరైన వ్యక్తులకు వేసే సమయం ఆసన్నమైందన్నారు. అవినీతిరహిత పాలన,దేశ రక్షణ,అభివృద్ధి, ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిపే వారిని ఎన్నుకోవడంలో డిగ్రీ యువత కీలకమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటడానికి యువత మిస్ కాకుండా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.