prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 6:49 pm Digital Edition : PRAJA VANI

పట్టభద్రులారా ఓటు నమోదు చేసుకోండి – సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ పిలుపు

పట్టభద్రులారా ఓటు నమోదు చేసుకోండి – సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ పిలుపు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా లోని లింగాలఘణపురం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ శనివారం పట్టభద్రులారా ఓటు నమోదు చేసుకోండి అని పిలుపునిచ్చారు.

స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు శనివారం నెల్లూట్ల గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అధ్యక్షత వహించగా, ఎన్నికల కో-ఆర్డినేటర్ నర్సింగ రమేష్ ఆధ్వర్యంలో గ్రామంలో ఓటర్ నమోదు ప్రక్రియపై చర్చించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ, 1-11-2023 కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి పట్టభద్రుడు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత అందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఓటు విలువను ప్రతి ఒక్కరికీ వివరించాలని, ఫారం-18 ద్వారా ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాచర్ల మహేందర్ పాల్గొని, ఇంటింటికి తిరిగి పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేయిస్తున్నామని తెలిపారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్-ఖమ్మం-నల్గొండ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి రాంరెడ్డి గెలుపు కోసం ప్రతి పట్టభద్రుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిఎల్ఏ లు కుర్రేముల రమేష్, జగ్గం ఆనంద్, జగ్గం అశోక్, కొండ్ర ప్రవీణ్, కొండ్ర యోనా, జెగ్గం కుమార్, జెగ్గం శాంతయ్య, నర్సింగ కృష్ణ తదితరులు పాల్గొని గడపగడపకు తిరిగి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.