పగలు, రాత్రి తేడా లేకుండా వీధిదీపాల వెలుగులు

*పగలు, రాత్రి తేడా లేకుండా వీధిదీపాల వెలుగులు* మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ ఏదీ? ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఒకవైపు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం సూచిస్తుంటే, మరోవైపు అశ్వారావుపేట మున్సిపాలిటీలో మాత్రం విద్యుత్‌ వృథా అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలూ వెలుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పట్టణ ప్రజలు అసంతృప్తి...