prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 1:56 pm Digital Edition : PRAJA VANI

పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్

పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్

మద్దూరు అక్టోబర్28, ప్రజా వాణి,

పంచాయతీరాజ్ శాఖ & గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డి.అనసూయ సీతక్క మరియు పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ సర్పంచులు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు మరియు ఇతర శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వి బి జి రాంజీ ద్వారా ఎక్కువ మొత్తంలో పనులు చేపట్టాలని ముఖ్యంగా జలసిరి పనులపై దృష్టి సారించి గ్రామంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 125 రోజులు పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.వివో బిల్డింగులు మరియు గ్రామపంచాయతీ బిల్డింగులు త్వరగా నిర్మించాలని సర్పంచ్ కోరడం జరిగింది. గ్రామపంచాయతీ కావలసిన మౌలిక సదుపాయాలు వి బి జి రామ్ జీ ద్వారా సమకూర్చుకోవాలని సూచించారు.ఈ యొక్క వి సి లో ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్ తో వివిధ గ్రామాల సర్పంచులు ఇట్టమైన కనకయ్య, కాసర్ల రేణుక కనకరాజుగారు, సుందరగిరి సత్యనారాయణ, నీరటి శ్రీనివాస్, గడిపే మౌనికఅనిల్, జక్కుల కనకమ్మతో పాటుగా ఏ ఓ రామకృష్ణ, ఏపీఓ మంజుల, ఇరిగేషన్ ఏ ఈ సతీష్, పంచాయతీ కార్యదర్శులు, మధు, బి.అశోక్,ఆర్ అశోక్, జి.కిరణ్, యన్.కిరణ్, పి.భాస్కర్,ఎండి రజియా పాల్గోన్నారు.