పంచాయతీరాజ్‌ చట్ట ఉల్లంఘన, నరేగా నిధుల దుర్వినియోగంపై ఆరోపణ

దాచారం ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు బెజ్జంకి, అక్టోబర్ 5 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బెజ్జంకి మండలం దాచారం గ్రామ ప్రజాప్రతినిధులు,ఎంపీడీవో కార్యాలయ అధికారులపై కనగండ్ల తిరుపతి ఫిర్యాదు చేశారు. పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనల ఉల్లంఘనతో పాటు నరేగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపిస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు అందజేశారు. ఈ అంశంపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తిరుపతి కోరారు. ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు...