prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 1:28 pm Digital Edition : PRAJA VANI

నేలకొండపల్లిలో బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నేలకొండపల్లిలో బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు, అహింసా సిద్ధాంతాలు, సత్యనిష్ఠ నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం హాజరైన వారికి పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల నాయకులు, యువజన నాయకులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.