నేరేడుచర్ల మార్కెట్ నూతన చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్
•వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి
•17 మందితో కమిటీ ఏర్పాటు,రెండేళ్ల పాటు పదవీకాలం
హుజూర్నగర్ అక్టోబర్ 8 (ప్రజావాణి) : మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం ఏర్పాటైంది. వ్యవసాయ, సహకార శాఖ జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 687 ప్రకారం మార్కెట్ కమిటీ ఐదో పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్, వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు.
నూతన పాలకవర్గంలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు 12 మంది సభ్యులు, జిల్లా మార్కెటింగ్ అధికారి, హుజూర్‌నగర్ సహాయ వ్యవసాయ సంచాలకులు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌ను అధికారిక సభ్యులుగా నియమించారు. మొత్తం 17 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాలకవర్గం కొనసాగనుంది.
నూతన పాలకవర్గ సభ్యులుగా సూరోజు రవీంద్రచారి, పొతురాజు జ్యోతి, బుర్రి వెంకటయ్య, రామావత్ వస్యా, ధనావత్ సైదులు, ఉట్కూరి సైదులు, కర్నం రామ నర్సయ్య, పల్లె కాశయ్య, గడ్డం ప్రియాంక, కత్తి శ్రీనివాస్‌రెడ్డి, పోల విశ్వనాథం, రెబ్బె రమేష్ నియమితులయ్యారు.
రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. నూతన పాలకవర్గం ఏర్పాటుకు సహకరించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.