prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 12:50 pm Digital Edition : PRAJA VANI

నేరేడుచర్ల పట్టణ ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి

*నేరేడుచర్ల పట్టణ ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి*
*నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగరాజు*
నేరేడుచర్ల, ప్రజావాణి ప్రతినిధి అక్టోబర్ 4:
నేరేడుచర్ల పట్టణ ప్రజలకు, యువతకు, పెద్దలకు మరియు మాతృమూర్తులకు నమస్కారం
ప్రస్తుత సంక్షుభిత పరిస్థితుల్లో మనమందరం అత్యంత కీలకమైన అంశంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
_ఎల్‌నినో ప్రభావం – అడుగంటుతున్న భూగర్భ జలాలు_
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన ఎల్‌నినో వాతావరణ ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గింది. ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో భూమి వేడెక్కి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.
ప్రతి నీటి బొట్టు భవిష్యత్తుకు రక్షణే కాబట్టి అవసరం మేరకే నీటి వినియోగం లో జాగ్రత్తలు పాటించి మిషన్ భగీరథ ద్వారా వస్తున్న తాగునీటిని అవసరమైన మేరకు మాత్రమే వాడుకోవాలి.
ప్రతి ఇంటి యజమాని నల్లాకు తప్పనిసరిగా ట్యాపులు (ఆన్/ఆఫ్) బిగించుకోవాలి. నీటిని వృథాగా రోడ్లపైకి, కాలువల్లోకి వదలకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇష్టానుసారంగా నీటిని వృథా చేస్తే, రాబోయే కాలంలో మున్సిపాలిటీ తరపున కఠినమైన ఆంక్షలు, చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కావున నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ ఈ తీవ్రతను గుర్తించి, నీటి సంరక్షణలో మున్సిపల్ యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని మరియు ఇంటింటి వర్షపు నీటి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము.
నీటిని కాపాడుకుందాం… భావితరాలకు భరోసా ఇద్దాం! నేరేడుచర్ల ప్రజల సంక్షేమమే మా మున్సిపాలిటీ ఏకైక లక్ష్యం.”
చెన్నబోయిన నాగరాజు ,
మున్సిపల్ కమిషనర్, నేరేడుచర్ల పురపాలక సంఘం.