prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:28 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

నేడు విద్యా కమిటీ ఎన్నికల్లో పుల్లవీడు పంచాయతీ  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూడు ఏకగ్రీవాలు

పోరుమామిళ్ల అక్టోబర్ 03 ప్రజావాణి నేడు జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని పులివీడు పంచాయతీ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు విద్యా కమిటీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చిన్న పులివీడు విద్యా కమిటీ చైర్మన్‌గా గొడుగు బాబు, వైస్ చైర్మన్‌గా రజియా బేగం, బొప్పాపురం విద్యా కమిటీ చైర్మన్‌గా గోవింద పల్లె మాధవి, వైస్ చైర్మన్‌గా రామ్మోహన్, పేరమ్మగారిపల్లె విద్యా కమిటీ చైర్మన్‌గా మొరస వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన విద్యా కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పోరుమామిళ్లలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి,ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డి.సి.గోవిందరెడ్డి, ఎన్నికైన వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ విద్యా కమిటీలకు ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ,ఈ బాధ్యతను పదవిగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు సేవ చేసే అవకాశంగా భావించాలని సూచించారు.పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య,అవసరమైన మౌలిక వసతులు,మంచి విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని అన్నారు. పాఠశాలలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, విద్యార్థుల అభివృద్ధి మరియు పాఠశాలల పురోగతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజలు, తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిజాయితీగా సేవలందించాలని, విద్యా రంగం అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆకాంక్షించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారందరికీ తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి,మాజీ సర్పంచ్ తిమ్మారెడ్డి రఘునాథరెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ సర్పంచ్ వెంకటరెడ్డి, మస్తాన్, రంగారెడ్డి,బాబు,బాలయ్య,అశోకు,గురివిరెడ్డి, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు