నెల్లుట్ల గ్రామంలో ఘనంగా పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 23(ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
గ్రామ శాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్ గౌడ్, ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ మండల కో-ఆర్డినేటర్, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో గడపగడపకు తిరిగి, పట్టభద్రులను కలిసి ఓటు నమోదు ప్రాధాన్యతను వివరిస్తూ, అక్కడికక్కడే ఓటు నమోదు చేయించారు.
అనంతరం వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టభద్రుల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, ఉద్యోగ, విద్యా అవకాశాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ మెంబర్ దామెర నాగరాజు, బిఎల్ఏ లు కుర్రేముల రమేష్, జగ్గం ఆనంద్, జగ్గం అశోక్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.