prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 7:43 pm Digital Edition : PRAJA VANI

నెల్లుట్లలో ప్రజా సంక్షేమ పథకాలపై కళా ప్రదర్శన ప్రారంభించిన సర్పంచ్ రామకృష్ణ

నెల్లుట్లలో ప్రజా సంక్షేమ పథకాలపై కళా ప్రదర్శన
ప్రారంభించిన సర్పంచ్ రామకృష్ణ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 05 (ప్రజావాణి) : జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.

ఈ కళా ప్రదర్శన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన పాటలు, నాటికల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఇలాంటి కళా ప్రదర్శనలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బత్తిని వేణు, వీడీసీ చైర్మన్ బత్తిని అశోక్, గ్రామ నాయకులు గాడిపెల్లి ఆంజనేయులు, కొత్తకొండ గంగాధర్, కళాకారుల బృందం, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.