prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 6:56 pm Digital Edition : PRAJA VANI

నెల్లుట్లలో ఎర్రకుంటకు గోదావరి జలాలు

నెల్లుట్లలో ఎర్రకుంటకు గోదావరి జలాలు.. 16L కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సర్పంచ్ రామకృష్ణ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జిల్లాలోని
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం, లింగాల ఘనపూర్ మండలం, నెల్లుట్ల గ్రామ రైతుల చిరకాల కోరిక నెరవేరింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి చొరవతో నెల్లుట్ల గ్రామంలోని ఎర్రకుంటను గోదావరి జలాలతో నింపే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు.

గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ 16L కాలువ ద్వారా గోదావరి నీటిని ఎర్రకుంటలోకి విడుదల చేసి, లాంఛనంగా ప్రారంభించారు. ఈ నీటితో ఎర్రకుంట పూర్తిగా నింపడం వల్ల చుట్టుపక్కల వందలాది ఎకరాల భూగర్భ జలాలు పెరిగి, రైతులకు తాగునీటి, సాగునీటి కొరత తీరనుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

గత కొన్నేళ్లుగా ఎర్రకుంట నీటి కొరతతో వెలవెలబోతోందని, ఈ విషయాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి 16L కాలువ ద్వారా గోదావరి నీటిని ఎర్రకుంటకు మళ్లించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని సర్పంచ్ తెలిపారు. తమ గ్రామ రైతుల పక్షాన కడియం శ్రీహరి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు మెంబర్లు బత్తిని వేణు, వీడీసీ చైర్మన్ బత్తిని అశోక్, మాజీ ఎంపీటీసీ మోతె వీరస్వామి, ఎర్రకుంట రైతులు కడకంచి మల్లేష్, రాజ్ కుమార్, ఉప్పలయ్య, మామిడ్ల అయోధ్య, బర్ల రమేష్, నాయకులు శివార్తి ఎల్లయ్య, చిట్ల తిరుమల రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, గ్రామస్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.