నెల్లికుదురు మండలంలో వైభవంగా దసరా..
కేరింతలు ఆనందోత్సాహాల మధ్య రావణ వధ..
ప్రజావాణి,నెల్లికుదురు: మండల కేంద్రంలో పాటు వివిధ గ్రామాలలో దసరా వేడుక మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ పాలక మండలిలు ఉత్సవాలకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. వివిధ గ్రామాలలోని ప్రజలు సామూహికంగా వెళ్తూ పాలపిట్టను దర్శించుకున్నారు. గ్రామాలలోని బొడ్రాయిల వద్ద ఆయా గ్రామాల సనాతన ఆచారాల ప్రకారం దసరా వేడుకలను వైభవోపేతంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువకులతో పాటు విరిసి అన్ని వర్గాల ప్రజలు కేరింతలు కొడుతుండగా సొర(ఆనిగ) కాయలు నరికి జంతుబలులను చేశారు.అంతకుముందు వేదమంత్రోచరణలతో షమీ పూజలు చేశారు.ఆయా కార్యక్రమాలలో ఆయా గ్రామాల సర్పంచులు పాలకమండలిలతో పాటు వివిధ కుల సంఘాల నాయకులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
నెల్లికుదురులో..స్థానిక విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో రావణ వధ వైభవో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన యువకులు ప్రజల వద్ద నుంచి కేరింతలు వెళ్ళు వెత్తాయి. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్న తో పాటు గ్రామపంచాయతీ పాలకమండలి పాల్గొనగా ఈ వేడుకలు తిలకించడానికి నెల్లికుదురు పట్టణ వాసులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
కాగా దసరా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నడుపుకునేందుకు స్థానిక ఎస్సై గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో కటిష్టమైన చర్యలు తీసుకున్నారు. విజయదశమి పురస్కరించుకొని స్థానిక పోలిస్ స్టేషన్లో ఆయుధ పూజ నిర్వహించారు.