prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 6:04 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

నూతన సీఐ పి. కిరణ్, ఎస్‌ఐ శేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖులు

ఘట్‌కేసర్, అక్టోబర్ 21 (ప్రజావాణి): దసరా పండుగను పురస్కరించుకుని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐ పి. కిరణ్, ఎస్‌ఐ శేఖర్‌లను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్ఛంతో అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఘన్‌పూర్ గ్రామ మాజీ సర్పంచ్ పావని వెంకటేష్, డాక్టర్ వాసం నాగరాజు, మానవ హక్కుల కమిషన్ ఆర్గనైజర్ కె. ప్రసాద్, ఘట్‌కేసర్‌కు చెందిన ఎం. శ్రీనివాస్, ఆర్. మనోజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఘట్‌కేసర్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు వారి కృషి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలు, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేసినప్పుడే సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.