prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 2:37 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

నూతన సీఐ కిరణ్‌ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

ఘట్‌కేసర్, అక్టోబర్ 21 (ప్రజావాణి): ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌ను ఘట్‌కేసర్ మండల అధ్యక్షులు గుండె ఉపేందర్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, ప్రజలు కూడా పోలీసులకు సహకరించడం ద్వారా సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు జమ్మిగారి గణేష్, ఏనాతుల సూర్య, ప్రధాన కార్యదర్శి ఊషిగల్లా వినోద్ కుమార్, ఈదుగల్ల ప్రవీణ్ కుమార్, ఎదులాబాద్ డివిజన్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చిలుగూరి ఆనంద్, ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షులు కడుపొల్ల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.