నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 30(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం ధర్మపురం గ్రామానికి చెందిన తాళ్లపల్లి గోపయ్య – రాజమ్మ దంపతుల కుమార్తె స్వాతి, వివాహం కృష్ణ కుమార్ గౌడ్ తో జరిగిన వివాహ మహోత్సవం శుక్రవారం దేవరుప్పుల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ శుభ సందర్భంగా జరిగిన వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. వధూవరుల కుటుంబ సభ్యులను కలిసి అభినందనలు తెలిపారు.
ఈ వివాహ కార్యక్రమం లో
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్
కామారెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ చింత రవి, బీఆర్ఎస్ నాయకులు ఆనంతోజు కృష్ణమూర్తి, వంగ అర్జున్, గుండె రమేష్,
తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు బంధుమిత్రులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
వివాహానికి హాజరైనందుకు వధూవరుల కుటుంబ సభ్యులు పల్లా సుందర్ రాంరెడ్డికి, బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.